తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అల్పాహార కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ మండలం గణేష్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించనున్నట్లు మండల విద్యాశాఖా ధికారి కె. శంకర్ రాథోడ్ తెలిపారు.మండలంలోని 24 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడతగా అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, పాఠశాలలకు విద్యార్థుల హాజరును పెంచడం, విద్యార్థుల ఆరోగ్యం మరియు విద్యాభివృద్ధికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మొదటి విడతలో కార్యక్రమం ప్రారంభమయ్యే పాఠశాలలు : ఎంపీయూపీఎస్ సులేమాన్ నగర్–1 ఎంపీపీఎస్ చింతల్‌మెట్,ఎంపీపీఎస్ సులేమాన్ నగర్–2, ఎంపీపీఎస్ ఎన్టీఆర్ నగర్ (ఉర్దూ మాధ్యమం), జెడ్పీహెచ్ఎస్ ఎన్టీఆర్ నగర్ (ఉర్దూ మాధ్యమం), ఎంపీపీఎస్ మదీనా మసీదు, ఎంపీపీఎస్ మహమ్మద్ నగర్, ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల హసన్ నగర్–6, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హసన్ నగర్–3, ఎంపీపీఎస్ బాబుల్ రెడ్డి నగర్, ఎంపీపీఎస్ దుర్గా నగర్, ఎంపీ పీఎస్ లక్ష్మీగూడ, ఎంపీపీఎస్ వంబే కాలనీఎంపీపీఎస్ పద్మశాలీపురం, జెడ్పీహెచ్ఎస్ పద్మశాలీ పురం, ఎంపీపీఎస్ మధుబన్ కాలనీ, ఎంపీపీఎస్ హనుమాన్ నగర్, ఎంపీపీఎస్ ప్రేమావతిపేట్,జెడ్పీహెచ్ఎస్ గణేష్ నగర్, ఎంపీపీఎస్ గణేష్ నగర్ఎంపీపీఎస్ నేతాజీ నగర్, ఎంపీపీఎస్ శ్రీరామ్ నగర్,ఎంపీయూపీఎస్ గగన్‌పహాడ్, ఎంపీపీఎస్ బుద్వేల్ రైల్వే స్టేషన్, మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖాధికారి కె. శంకర్ రాథోడ్ తెలిపారు.
