తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ సామాజిక భద్రత (చేయూత) పింఛన్ల మంజూరు కోసం కొత్త దరఖాస్తులను స్వీకరిస్తోందని ఎస్ఎల్ ఎఫ్ సంధ్యా, కీలుగు హేమలత తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, దివ్యాంగులు, అలాగే ఫైలేరియా, థలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి వ్యాధిగ్రస్తులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హులైన లబ్ధిదారులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో అత్తాపూర్ సర్కిల్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. చేయూత పింఛన్ దరఖాస్తు ఫారాలను అధికారిక వెబ్‌సైట్ cheyutha.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ​ఈ కార్యక్రమంలో బాబుల్‌రెడ్డి నగర్ ఎస్‌ఎల్‌ఎఫ్ ప్రతినిధులు సంధ్యా, హేమలత తదితరులు పాల్గొన్నారు.