తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సేవల శాఖల మంత్రి వాకిటి శ్రీహరిని తెలంగాణ సెక్రటేరియట్‌లో యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ ఐస్ స్కేటర్ ప్రణవ్ మాధవ్ సురపనేని, ఆయన తల్లిదండ్రులు రఘు , శ్రీమతి కవిత , మియాపూర్ డివిజన్ నాయకులు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ అలాగే శ్రీమతి నవ్యశ్రీ ,శశి మర్యాదపూర్వకంగా కలిశారు. కేవలం17ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ తెలంగాణతో పాటు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న ప్రణవ్ మాధవ్ సురపనేని సాధించిన విజయాలను ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి అభినందించారు. ఏషియన్ ఓపెన్ షార్ట్ ట్రాక్ ఛాంపియన్‌షిప్ 2026 డెహ్రాడూన్ ప్రణవ్ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో మూడు పతకాలను సాధించారు.1000మీటర్ల విభాగంలో రజత పతకం, 500మీటర్ల విభాగంలో కాంస్య పతకం, మెన్స్ రిలేలో కాంస్య పతకం ప్రణవ్ సాధించిన ఇతర ఘనతలు. మల్టిపుల్ టైమ్ నేషనల్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడలిస్ట్ వరల్డ్ జూనియర్ కప్స్ , వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత కేవలం17ఏళ్ల వయసులోనే సీనియర్ వరల్డ్ టూర్‌కు అర్హత 2030ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యం. ఈ సందర్భంగా ప్రణవ్ మాధవ్ సురపనేనిని ఘనంగా అభినందించి, శాలువాతో సత్కరించారు. క్రీడల పట్ల ఆయన చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల , ప్రతిభకు సాధించిన విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్ వేదిక వరకు ప్రణవ్ సాగిస్తున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించి, వారికి అవసరమైన అవకాశాలు, సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రణవ్ వంటి యువ ప్రతిభావంతులు తెలంగాణ క్రీడా రంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు, భారతదేశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. తెలంగాణ గర్వం భారతదేశపు ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని 2030 ఒలింపిక్స్ లక్ష్యం దిశగా మరో అడుగు.