తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ ధర్నా చౌక్‌లో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు బి. యాదగిరి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, పెన్షన్‌ హక్కులను పరిరక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల భవిష్యత్‌ భద్రతకు పెన్షన్‌ అత్యంత కీలకమని, పెన్షన్‌ విధానంలో మార్పుల వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి ఎ. మహేశ్వర్‌, సీనియర్‌ జిల్లా నాయకులు జె. శ్రీనివాస్‌, సీతయ్య, మండల బాధ్యులు ఖాలీది, జి. నందన, ఉమామాలతి, మధులత, మాలతి దేవి, కృష్ణయ్య, ఎం. శ్రీనివాస్‌, యాదిలాల్‌, ఈవీఎం రెడ్డి, కిరణ్‌ కుమార్‌, విజయ్‌ శ్రీ, సుజాత, నవనీత, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.