తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్మరణీయమని అన్నారు.రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, రైతు రుణాల ఉపశమనం, పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, 108అత్యవసర సేవలు, విద్యార్థుల భవిష్యత్తుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వైఎస్సార్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారి జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో వైఎస్సార్ సాగించిన ప్రజా పాలన నేటికీ ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ స్ఫూర్తిగా తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, సంక్షేమం మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. అనంతరం, మియాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, మహానేత వైఎస్సార్ ప్రజాసేవా స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో ఆయనకు చెరగని స్థానం కల్పించాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు సామాన్య ప్రజలకు ఎంతో భరోసాను అందించాయని, ప్రజల అవసరాలను గుర్తించి వారికి అండగా నిలిచిన నాయకుడిగా వైఎస్సార్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని యలమంచి ఉదయ్ కిరణ్ పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు ఆయన ప్రజాసేవా స్ఫూర్తి భావితరాలకు ఎప్పటికీ మార్గదర్శకం. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు సయ్యద్ గౌస్, నర్సింగ్ రావు, నగేష్ నాయక్, కున్యా నాయక్, భరత్ గౌడ్, రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, హున్యా నాయక్, కావూరి ప్రసాద్, పట్వారీ శశిధర్, మన్నేపల్లి సాంబశివరావు, రాజేష్, రాములు గౌడ్, శివకుమార్, మారెళ్ల శ్రీనివాస్, రామస్వామి, అంతిరెడ్డి, జగన్, గోపాల్ నాయక్, నర్సింహ, లక్ష్మణ్, జావేద్, వెంకటేష్, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి, నాయకులు శ్రీమతి శశిరేఖ, శ్రీమతి శ్రీజా రెడ్డి, శ్రీమతి జయ, ఎన్ఎస్యూఐ చందానగర్ డివిజన్ అధ్యక్షులు చంద్రమౌళి, శ్యామ్ నాయక్, పాండు నాయక్, సర్దార్, మోహన్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, మరియా రాజు, ప్రేమ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
