తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో పేదల పెన్నిధి, అభివృద్ధి ప్రదాత, జన హృదయాల్లో చెరగని ముద్రవేసి దివికెగిసిన ప్రియతమ నేత స్వర్గీయ డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వై.ఎస్.ఆర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్గీయ రాజేశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం ఎనలేని కృషి చేశారని, ఫీజు రియంబర్స్మెంట్, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, రచ్చబండ లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రతి పేదవాడి గుండెలో ఆయన బ్రతికే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, గోపాల్, పోశెట్టిగౌడ్, పాండుగౌడ్, షౌకత్ అలీ మున్నా, లింగం, సుధాకర్, శ్యామ్, ఇస్మాయిల్, ఖలీమ్, ఖాజా, గౌస్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
