తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాబుల్‌రెడ్డి నగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల కోసం అల్పాహార కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్మన్ ఆకుల జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారం అందించారు. విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధించగలరని ఆమె పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
