తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో కృష్ణాష్టమి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలో ముస్తాబై నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. చిన్నారుల వేషధారణ, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. పిల్లల్లో చిన్ననాటి నుంచే మన పండుగలు, సంప్రదా యాలు, సంస్కృతి పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనతో పాటు పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందు తాయని ఉపాధ్యాయులు తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది..కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు వెంకట పరమేశ్వర్, శ్రీదేవి, సుజాత, మేరీ, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.