తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరామ కాలనీలోని ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ బస్తివాసులు గత ఏడు సంవత్సరాలుగా వీధి దీపాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్తీలోని ఏ ఒక్క వీధిలోనూ ఇప్పటివరకు వీధిలైట్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీ పరిసరాల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పటికీ, బస్తీ వీధుల్లో కనీసం వీధి దీపాల సౌకర్యం కల్పించకపోవడం దారుణమని బస్తివాసులు అంటున్నారు. ఏడు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నామని, వీధిలైట్ల ఏర్పాటు కోసం పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. రాత్రి వేళల్లో వీధులు పూర్తిగా చీకటిమయం కావడంతో బయటకు రావాలంటే భయంగా ఉంటోందని స్థానికులు చెబు తున్నారు. చీకట్లో పాములు, విషపురుగులు సంచరి స్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు మరింత ఆందోళనకు గురవు తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో రాత్రివేళ బయటకు వెళ్లాల్సి వస్తే చీకట్లోనే వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని సంబంధిత విద్యుత్ అధి కారులు వెంటనే స్పందించి ఇందిరాగాంధీ హౌసింగ్ సొసైటీలోని అన్ని వీధుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని బస్తివాసులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
