తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని దుర్గా నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదేశాల మేరకు శ్రీనివాస ఆసుపత్రి సమీపంలో రూ.7.50 లక్షల వ్యయంతో కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్డు నిర్మాణంతో స్థానికంగా రాకపోకలకు ఇబ్బందులు తొలగి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి రానుందని నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధనుంజయతో పాటు టీ. ప్రేమ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, కే. జగ్గు, లక్ష్మారెడ్డి, ఆంజనే యులు గౌడ్, భాస్కర్ రెడ్డి, వెంకటేష్, ప్రసాద్, రాజు, శ్రావణ్, ఈశ్వర్ పంతులు, శ్రీపాల్ రెడ్డి, ఫయీం భాయ్ తదితర కాంగ్రెస్ నాయకులు, స్థానిక బస్తీవాసులు పాల్గొన్నారు.