తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో బాబుల్ రెడ్డి నగర్‌లో ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ మాజీ వార్డు సభ్యులు సోమ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ప్రజలు పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాళిదాస్, రవి ముదిరాజ్, రాయుడు, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు స్థానికులు జయ ప్రకాష్, హేమలత, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
