తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆదర్శ కాలనీలో ఏర్వ గాయత్రి ఆధ్వర్యంలో సహజసిద్ధమైన పసుపుతో గణపతి విగ్రహాన్ని రూపుదిద్దారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే హానిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ​చవితి రోజున ఈ పసుపు గణపతికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణానికి ఎలాంటి హానీ తలపెట్టని విధంగా పండుగలు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ సహజసిద్ధ లేదా మట్టి ప్రతిమలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా కోరారు.