తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :శారదానగర్ కమ్యూనిటీ హాల్‌లోని జీకేఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రాంగణంలో ఆదివారం (సెప్టెంబర్ 13) తైక్వాండో, కర్రసాము విభాగాల విద్యార్థులకు బెల్ట్ ప్రమోషన్ పరీక్షలు విజయవంతంగా ముగిసాయి.​ఈ పరీక్షలను కేవీకే మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన మాస్టర్ ఉదయ్ కిరణ్, మాస్టర్ సూర్య తేజ (బబ్లూ మాస్టర్) నిర్వహించగా, జీకేఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సమన్వయకర్తలుగా వ్యవహ రించారు.తైక్వాండో, కర్రసాము విభాగాల నుంచి సుమారు 40 నుండి 50 మంది విద్యార్థులు ఈ బెల్ట్ పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాలు, శారీరక దృఢత్వం, క్రమశిక్షణతో కూడిన మెళకువలను ప్రదర్శించి ఆహూతులను ఆకట్టుకున్నారు. పాల్గొన్న విద్యార్థులందరూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పరీక్షల్లో ఉత్తీర్ణు లయ్యారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు.. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని, క్రమశిక్షణను పెంపొందిస్తున్న అకాడమీ యాజమాన్యానికి, శిక్షకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పిల్లల నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి వేదికలను కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ​ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. విజయం సాధించిన విద్యార్థులను అభినందించడమే కాకుండా, భవిష్యత్తులో కూడా ఇదే విధమైన అంకితభావం, పట్టుదలతో సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.