తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పుప్పాలగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ది సిటీజన్స్ కౌన్సిల్ వ్యవస్థాపక చైర్మన్ ధూళిపాల సీతారాం దంపతుల ఆర్థిక సహకారంతో రెండు దూరదర్శన్ టెలివిజన్లను అందజేశారు.విద్యార్థులకు విద్యాబోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పాఠశాలకు టెలివిజన్లను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నివాస సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ధూళిపాల సీతారాంను స్థానికులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపేంద్రనాథ్ రెడ్డి, రాజ్ కుమార్, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, షేక్ ఆరిఫ్, సుమనళిని, సంగం శ్రీకాంత్, జైరామ్, సుమన్, బాబురావు, శ్రీబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.