తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ బీజేపీ, టీడీపీ నాయకులు భక్తులకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతో పాటు కాలుష్యాన్ని నియంత్రించ వచ్చని నాయకులు తెలిపారు.భక్తిశ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే సందేశంతో ప్రజల్లో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అడికే రాజు, బల్ల శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు, రవి, నాగరాజు రేవంత్, యు. విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.