తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :.మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన రుషి నగర్‌లో ఉన్న శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి ప్రతిమకు ట్రస్ట్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి   నైవేద్యం సమర్పించి భక్తిశ్రద్ధలతో  చేపట్టారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు ఏర్వ సత్యనారాయణ, కాశీగారి యాదగిరి, ఉష్కమూరి విజయ్ కుమార్, దొంత రాజు, సామల యాదయ్య, బండరీ యాదగిరి, ఏర్వ కుమారస్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.