తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్‌లో ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ పోస్టర్‌ను టీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నీరుడు సర్వేష్ ముదిరాజ్ మాట్లాడుతూ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజల సమస్యలు, సామాజిక న్యాయం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే పాంచజన్య కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో నిర్వహించే ఈ సభ ద్వారా భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో భువనగిరి ఇంద్ర, మహిళా నాయకులు పూజారి ప్రవీణ్ కురుమతో పాటు లక్ష్మి, లలిత్ యాదవ్, రాజేష్ ముదిరాజ్, సాయి, తిమ్మప్ప, శ్రీను, సుశీల్, అఖిల్ కుమార్, రాము, బాలు, వెంకటేష్, హేమేంద్ర, వంశీ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
