తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని పల్లె చెరువు ప్రాంతంలో వెలసిన గణేష్ మండపం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండప ప్రాంగణమంతా భక్తుల శివనామస్మరణలు, “గణపతి బప్పా మోరియా” జయజయధ్వనులతో ప్రతిధ్వనించింది.పూజా కార్యక్రమాల అనంతరం భక్తుల కోసం భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రామస్వామి, అశోక్ కుమార్, చిన్నం ప్రవీణ్, సునీల్, నరేష్, సంతోష్‌లతో పాటు స్థానిక ప్రముఖులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
