తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : సీపీఐ రాజేంద్రనగర్ మండల కార్యాలయం సమీపంలోని బస్తీ వాసులు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ మీసాల బ్రదర్స్ జె. విజయ్ ఆనంద్ గౌడ్, జె. సదానంద్ గౌడ్, జె. ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను గణేష్ మండపం యువత ఘనంగా సత్కరించింది. సీపీఐ మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి కన్యగారి నర్సింహ్మరెడ్డి, సీపీఐ మండల కార్యాలయ కార్యదర్శి జి. సత్యం, సీపీఐ కాటేదాన్ శాఖ కార్యదర్శి శ్రీరాములు, రాత్లావత్ బిక్షపతి నాయక్, కె. మధు, శీను, యువత, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.