తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ హనుమాన్ ఆటో స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఉష్కమూరి విజయ్ కుమార్ పాల్గొని గణపతిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు ఉష్కమూరి విజయ్ కుమార్‌ను శాలువాతో సత్కరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.