తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలో పసుపు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఆదర్శ కాలనీకి చెందిన ఏర్వ కుమారస్వామి కుమార్తె ఏర్వ గాయత్రి పసుపుతో గణపతి ప్రతిమను స్వయంగా తయారు చేసి, ఇంట్లో మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం పూజలు అందుకున్న పసుపు గణపతి ప్రతిమను ఇంట్లోనే బకెట్‌లో నిమజ్జనం చేశారు. దీంతో భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పర్యావరణహిత వినాయక ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ, చిన్నారుల్లోని ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు భక్తిశ్రద్ధలను పెంపొం దించాలనే ఉద్దేశంతో గాయత్రి తయారు చేసిన పసుపు గణపతిని పూజకు ఉపయోగించామని తెలిపారు. మూడు రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం ప్రతిమను బకెట్‌లోనే నిమజ్జనం చేశామన్నారు.
