తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలోని 60 అడుగుల రోడ్డు పక్కన చెత్తను కవర్లలో వేసి పడేస్తుండటంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే ప్రాంతంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. చెత్త తినేందుకు వచ్చిన మేకలు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన సంఘటనలు చోటుచేసు కున్నాయి. దీంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసి ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు, చెత్తను క్రమం తప్పకుండా తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు, మూగజీవాల భద్రత దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
