తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, కామారెడ్డి: భిక్నూర్ మండలం రామేశ్వర్ పల్లి గ్రాములో నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిక్కనూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేందర్‌రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మద్ది కృష్ణారెడ్డిని రామేశ్వర్‌పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే బిక్కనూర్ మండల జనరల్ సెక్రటరీగా బత్తిని రాజేందర్, రామేశ్వర్‌పల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఒల్లెపు శశికుమార్, బీసీ సెల్ అధ్యక్షులుగా ధర్మస్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా గడ్డం లింగం, కిసాన్ సెల్ అధ్యక్షులుగా పైల్ల రమేష్‌రెడ్డిని నియమించారు.
అదేవిధంగా అయ్యవారిపల్లి గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. గ్రామ సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బర్లా పెంటయ్య, ఉపాధ్యక్షుడిగా బర్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా లస్మయల స్వామి, కార్యదర్శిగా బర్ల స్వామి, కోశాధికారిగా బుచ్చయ్యలను నియమించారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతన కమిటీలు సమష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఏనుగు శ్రీనివాసరెడ్డి, వీఢీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్‌గౌడ్, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్‌రెడ్డి, ఎండోమెంట్ డైరెక్టర్ నాగర్తి రమేష్‌రెడ్డి, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, సొసైటీ డైరెక్టర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తక్కల బాపురెడ్డి, కందడి బాల్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
