• అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు హనుమకొండ అదాలత్ సర్కిల్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎంపీ డాక్టర్ కడియం కావ్య అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ రవి, కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, డీఆర్వో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
