తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆదర్శ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పర్వతాల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా పర్వతాల రాజేందర్ మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.