తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, సురభి కాలనీలో సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం వారు నిర్వహించు 27వ వార్షిక గణపతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ కీ.శే. శ్రీమతి రాగం సుజాత యాదవ్ జ్ఞాపకార్థం నివాళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కీ.శే. సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం, సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం మరియు శ్రీ అభయాంజనేయ దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మాయాబజార్ నాటక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. వారితో పాటుగా రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు అభిమానులు మాట్లాడుతూ, కీ.శే. రాగం సుజాత యాదవ్ మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని, వారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, మీ సేవలు మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరువలేము, మర్చిపోలేము అని, సుజాత యాదవ్ తన జీవితాంతం పేదలకు, మహిళలకు అండగా నిలిచారని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. వారి జ్ఞాపకార్థం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సురభి కాలనీ నాటక మందిరాన్ని అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ రవి యాదవ్, శ్రీకాంత్ దేవులపల్లి, నర్సింహా, వెంకటేశ్వర్లు, సురభి కాలనీ వాసుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కోదండరాం, వైస్ ప్రెసిడెంట్ జయకృష్ణ, సెక్రటరీ భాను, జాయింట్ సెక్రటరీ జితేంద్ర, వేణు మాధవ్, శేఖర్, రమణ, బస్వయ్య, షఫీ, సారయ్య గౌడ్, నర్సింలు, మహేందర్, మహేందర్ సింగ్, రఘు, సాయి, నాందేవ్, మహిళలు చంద్రకళ, కుమారి, యమున, కళ్యాణి, లక్ష్మి, సుధారాణి, గౌసియా, సబియా, జయమ్మ స్థానిక కాలనీలో వాసులు, సంక్షేమ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
