తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నిజాం నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ, రాపోలు సత్యయ్య కొనియాడారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ కోసం సాగిన పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నా రు.మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని భావన ఋషి నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి ట్రస్ట్ భవనంలో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు లర్పించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండా లక్ష్మణ్ బాపూజీ సాహసోపేతంగా పోరాడారని తెలిపారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. శాసన మండలి సభ్యుడిగా ప్రజాసేవ అందించడంతో పాటు తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు, సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కాశీగారి యాదగిరి, దొంత రాజు, కొంపల్లి జగదీష్, సామల యాదయ్య, బండారి యాదగిరి, బిర్రు రాధాకృష్ణ, ఈప్పలపల్లి చిరంజీవి, సిద్దిరాల రాజ్‌కుమార్, కైరాంకొండ శ్రీనివాస్, కోట శ్యామ్‌కుమార్, ఏర్వ కుమారస్వామి, గంజి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.