• హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించిన పద్మశాలి కుల బాంధవులు

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన 14వ వర్ధంతి కార్యక్రమాన్ని హుజురాబాద్ పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సమాజం నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు పద్మశాలి నాయకులు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన సొంత ఇంటిని సైతం త్యాగం చేశారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు, పదవులను సైతం తృణప్రాయంగా వదిలేసి ప్రజా శ్రేయస్సు కోసం పోరాడిన నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీని వారు గుర్తు చేసుకున్నారు. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిత్వంతో ప్రజల కోసం నిరంతరం పోరాడారని పేర్కొన్నారు. ఆనాటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాడిన వీరుడిగా ఆయన సేవలను కొనియాడారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర, సామాజిక సేవలు, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సహకారం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పద్మశాలి సమాజం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పద్మశాలి సమాజం నాయకులు చిలుకమారి శ్రీనివాస్, వేముల యాదగిరి, మచ్చికట్ల కమలాకర్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, కుడికాల సాయి, సబ్బని రాజేందర్, విడపు రాజు, ఆడెపు సూర్యం, చందుపట్ల జనార్ధన్, సంగెం సత్యనారాయణ, సంగెం భాస్కర్, సంగెం శ్రీధర్, గాలి సమ్మయ్య, మంద బిక్షపతి, మార్తా రవీందర్, కొండా గణేష్, మండల యాదగిరి, మంచికట్ల వెంకటరాజం, సంగెం శ్రీనివాస్ (చిక్స్), సంగెం ఐలయ్య, సంగెం శ్రీనివాస్ (మెడికల్), వల్గొండ కుమార్, వేముల రమేష్, ఎలిగేటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Huzurabad Konda Laxman Bapuji, Konda Laxman Bapuji Death Anniversary, Huzurabad Padmashali Society

Avatar photo

By Murthy