తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి పారిజాత నరసింహారెడ్డిని మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు యలమంచి ఉదయ్ కిరణ్, ఆల్విన్ కాలనీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకుని హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి పారిజాత నరసింహారెడ్డిని సంప్రదాయబద్ధంగా శాలువాతో ఘనంగా సత్కరించి, మొక్కను అందజేసి తమ గౌరవాభిమానాలను చాటుకున్నారు. అనంతరం, నాయకులు మాట్లాడుతూ, ఆమె సమర్థవంతమైన నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల సంక్షేమానికి ఆమె అందించే నాయకత్వం మరిన్ని విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ సీనియర్ నాయకులు బాష్పాక యాదగిరి , బాబ్జి, సాయి లోహిత్, శశి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొత్త బాధ్యతల్లో శ్రీమతి పారిజాత నరసింహారెడ్డి మరిన్ని విజయాలు సాధిస్తూ, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి విశేష కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
