తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్, హుజూరాబాద్: హైదరాబాద్లోని కోకాపేటలో 2.5 ఎకరాల స్థలంలో పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు.

పద్మశాలి సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్ ఆధ్వర్యంలో, చిలుకమారి శ్రీనివాస్, మంచికట్ల కమలాకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, బండారి సదానందం, మార్త రవీందర్, వేముల యాదగిరి, చందుపట్ల జనార్దన్, కూరపాటి రామచంద్రం, సంఘం సత్యనారాయణ, సంగం శ్రీనివాస్, మెడికల్ సంఘం శ్రీనివాస్, చిప్స్ దేవసాని ప్రియదర్శిని, కేఆర్ భిక్షపతి, కాంగ్రెస్ నాయకుడు ఇప్పకాయల సాగర్, కుడికాల ప్రభాకర్, ముషం రాజేందర్, కోమటి సదానందం, మామిడాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో పద్మశాలి కులబాంధవులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆత్మగౌరవ భవనానికి నిధుల కేటాయింపుపై సమాజం తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
