బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి శాలువాతో సన్మానించిన చేనేత ఐక్య వేదిక ప్రతినిధులు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను గురువారం ఉదయం బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లో వివిధ సామాజిక వర్గాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ఒక్కో వర్గానికి రూ.5 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం జీఓ మంజూరు చేసిన నేపథ్యంలో, పద్మశాలి సమాజానికి సంబంధించిన జీఓ కాపీ అందిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాపోలు వీరమోహన్ వెంట గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి చెరుకు విజయ్ పాల్గొన్నారు.
పద్మశాలి సమాజ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ, సమాజ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నాయకులు అభినందనలు తెలిపారు.
