తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్ స్టన్ పార్క్ విల్లాస్ క్లబ్ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్ కీ.శే. రాగం సుజాత యాదవ్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన పెద్దలకు బియ్యం ఇవ్వడం మరియు దేవాలయంలో గంట కట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకులైన మిరియాల రాఘవరావు విచ్చేసి కీ.శే. రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగ మిరియాల రాఘవరావు మాట్లాడుతూ, ప్రజా సేవలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన రాగం సుజాత యాదవ్ ఇక లేకపోవడం తీరని లోటని , వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
