తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి *టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలను తెలుసుకొని, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పట్టభద్ర ఓటర్లను సమన్వయం చేసుకొని ఎన్నికలకు పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించగలమని బండి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
