తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్; శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు మల్లెల జయ అనిల్ కుమార్ యాదవ్ ను ప్రత్యేకంగా కలిసి శాలువాలతో గజమాలతో సత్కరిస్తూ హృదయపూర్వకంగా అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతూ, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో పాటు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.