తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం శంషాబాద్‌లోని మల్లిక కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ, డివిజన్ల ఇంచార్జులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కాంగ్రెస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలని, పట్టభద్రులను కలిసి అభ్యర్థికి మద్దతు కూడగట్టేందుకు కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.