తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కీలక సన్నాహక సమావేశంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ తో కలిసి మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  సామ రామ్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ శ్రేణుల భాగస్వామ్యం, సంస్థాగత సమన్వయం ప్రాధాన్యతను నాయకులు వివరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏఐపీసీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పరజాత నరసింహారెడ్డి , శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ , కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బండి రమేష్ , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ , చల్లా నరసింహారెడ్డి , మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ నాయకులు, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వం చేపట్టాల్సిన సన్నాహాలు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ఎన్నికల నిర్వహణలో సమష్టి కృషి వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు.