తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నేహితుడు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డిని తన నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్ లో మంచి ఆయురారోగ్యంతో పాటు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
