• భీమనాథుని సత్యనారాయణ పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, బీసీ సంఘం జిల్లా నాయకులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హన్మకొండ: హన్మకొండలోని కూరపాటి ఆసుపత్రి అధినేత, కూరపాటి ఫౌండేషన్ ద్వారా పేదలకు వైద్య సౌకర్యాలు అందిస్తున్న డాక్టర్ కూరపాటి రమేష్ పద్మశాలిని భీమనాథుని సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి రమేష్ తనను శాలువాతో సన్మానించడంతో భీమనాథుని సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు కూరపాటి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి రమేష్‌తో భీమనాథుని సత్యనారాయణ ఆత్మీయంగా మాట్లాడారు.