తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల పరిధిలోని పట్టభద్రులందరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలన్ సుభాష్ రెడ్డి కోరారు.

ఈ మేరకు హైదర్‌గూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులతో ఆయన చర్చించారు. ప్రతి డివిజన్ పరిధిలో ఒక్క పట్టభద్రుడు కూడా ఓటరు నమోదుకు దూరం కాకుండా నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

అలాగే, నవంబర్ 6లోపు అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ముద్రణ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ వార్తల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని కోలన్ సుభాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.