తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో రాజేంద్రనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుధాకర్ హాజరయ్యారు. మండల విద్యాశాఖాధికారి శంకర్ రాథోడ్, పాఠశాలల సముదాయ ప్రధానోపా ధ్యాయుడు శ్రీనివాసరావు పాల్గొన్ని జార్ఖండ్‌కు చెందిన దాత రాహుల్ అగర్వాల్ విద్యార్థులకు దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాలకు స్మార్ట్ టీవీని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, స్మార్ట్ టీవీ ద్వారా పాఠ్యాంశాలను దృశ్యరూపంలో వివరించడం సాధ్యమవుతుందని, తద్వారా విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి, అభ్యసన సామర్థ్యాలు మెరుగు పడతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని, విద్యార్థుల విద్యాభివృద్ధికి స్మార్ట్ టీవీ ఎంతగానో దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలకు స్మార్ట్ టీవీని విరాళంగా అందించిన రాహుల్ అగర్వాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.