• రాపోలు వీర మోహన్ చేతుల మీదుగా నేతన్న టీవీ అవార్డ్స్–2026 పోస్టర్ ఆవిష్కరణ
• దండు మల్కాపురంలో అవార్డ్స్‌కు శ్రీకారం.. దరఖాస్తులకు ఆహ్వానం
👉నేతన్న టీవీ ఛానెల్ లింక్ క్లిక్ చేసి చూడండి
https://youtube.com/@nethannatv?si=CO2Kk63Z-RxeUc2n
దండు మల్కాపురం: పద్మశాలి సమాజంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చి వారికి తగిన గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న నేతన్న టీవీ అవార్డ్స్–2026 పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గౌరవ అధ్యక్షులు శ్రీ రాపోలు వీర మోహన్ చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పద్మశాలి సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి సత్కరించేందుకు ఈ అవార్డులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే నేతన్న టీవీ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, మహిళా నాయకులు, యువజన ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, నేతన్న బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
అనంతరం నేతన్న టీవీ అవార్డ్స్–2026 దరఖాస్తుల పోస్టర్లను ఆవిష్కరించి, అర్హులైన వారు తమ దరఖాస్తులను పంపించాలని నిర్వాహకులు కోరారు.
దరఖాస్తుల కోసం వాట్సాప్ నంబర్: 9441623078
“పద్మశాలి సమాజ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడమే మా లక్ష్యం” అని నిర్వాహకులు స్పష్టం చేశారు.
