ఎస్ ఐ ఆర్ సవరణ ప్రక్రియలో వేగం డిజిటలైజేషన్ ను స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్

తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా పట్టణా ల్లోని ఇళ్లు ఖాళీ స్థలాలు ప్రభుత్వ భూములపై వివాదాలు లేకుండా పారదర్శకమైన రికార్డులు రూపొం దించడానికి పక్కా ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయి పరిశీలన ను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మహబూబాబాద్ మున్సి పల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ వార్డు అధికారులతో ‘నక్ష’ కార్యక్రమంలో భాగంగా పట్టణ ఆస్తుల కచ్చితమైన డిజిటలైజేషన్ కోసం అధికారులు మున్సిపాలి టీ పరిధిలోని ప్రాంతాలను వార్డులు వార్డులోని వీధులు గల్లీలు ల్యాండ్‌ మార్క్‌లపై కౌన్సిలర్లకు పూర్తి అవగా హన ఉంటుంది కావున స్థానిక కౌన్సి లర్ ల సమన్వయంతో నిర్వహించా లని అన్నారు ఎస్ ఐ ఆర్ సవరణ ప్రక్రియలో వేగం డిజిటలైజేషన్ ను స్వయంగా పరిశీలించి సర్వే ద్వారా ఎలాంటి తప్పులు లేని పారదర్శక మైన ఓటరు జాబితాను రూపొందిం చేందుకు కంప్యూటర్లలో మరియు యాప్‌లలో డేటా ఎంట్రీ ప్రక్రియను వారు స్వయంగా తనిఖీ చేస్తూ ఆన్‌ లైన్ డేటా ఎంట్రీ చేసే సమయంలో ఓటర్ల పేర్లు ఇంటి నంబర్లు స్పెల్లింగ్‌ లు తప్పుల్లేకుండా నమోదు చేయా లని స్పష్టం చేశారు ఈ తనిఖీ లో మునిసిపల్ చైర్మెన్ జ్యోతి రమేష్ కమిషనర్ వినోద్ కుమార్ టౌన్ ప్లానింగ్ అధికారి సాయిరాం తదిత రులు పాల్గొన్నారు.