తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం: శేరిలింగంపల్లి నియోజకవర్గం, మాదాపూర్ డివిజన్ లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగ సురేష్ నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలలో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ టీపీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ. కార్పొరేషన్ చైర్మన్ జెరిపెటి జైపాల్ , యాదవ కార్పొరేషన్ చైర్మన్ ఎం. రఘునాథ్ యాదవ్, టీఆర్ఐసీఓ ఆర్ చైర్మన్ బెల్లయ్య నాయక్, శేరిలింగంపల్లి కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డిలతో కలిసి మహిళా సంఘ సేవకురాలు, శేరిలింగంపల్లి కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షురాలు. మల్లెల జయ హాజరై వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్బంగ మల్లెల జయ మాట్లాడుతు, ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలను స్మరించుకుంటూనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత పథకాలను ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలో సురేష్ నాయక్ పనితీరును అనుసరించాలని, సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య శిబిరం, అన్నదానం, ఉచిత మందుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టి తన సోదరుడి సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న డీ. నాగేశ్ ను అభినందించారు.