హన్మకొండ, జులై15.ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులకు అద్దె వాహనాలు నడుపుతున్న యజమానులు సమ్మెకు పిలుపును ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇస్తున్న నెలవారి అద్దెను రూ.33 వేల రూపాయల నుండి రూ.55000 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వానికి కూడా వినతి పత్రాలు సమర్పించిన మాకు ఎలాంటి పురోగతి లేనందువల్ల ప్రస్తుత ప్రజాపాలన లో ఉన్న డిప్యూటీ సీఎం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి నీ మాకు న్యాయం చేయాలని మా ప్రతిపాదనను ఆమోదించ వలసిందిగా అధికారులను కోరుతున్నాము.వాహనాల బకాయిలు కూడా సుమారు రూ.170 కోట్ల రూపాయలు బకాయిలు కూడా రాబట్ట లేకపోవడంతో పాటు, అద్దె వాహనాల ఈఎంఐ లు పిల్లల స్కూల్ ఫీజులు,పేరుకుపోవడం వల్ల మాకు నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు,ఇన్సూరెన్స్,ఫిట్నెస్ కూడా ఒక సంవత్సరం వరకే ఇస్తున్నారు. ఇలాంటి చార్జెస్ అన్నీ కూడా మాకు చాలా భారంగా ఉంది. కాబట్టి మాకు ప్రతి నెల ఐదో తారీకు వరకు అద్దె వాహనాల బిల్లులో చెల్లించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము వినతి పత్రాలు సమర్పించిన 2017 లో ఇచ్చిన జీవోను ఇప్పటివరకు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గత రెండు నెలల ముందు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తానని ప్రతిపాదించారు. వాహనాలకు మేము ప్రతి నెల సుమారుగా రూ.15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాము.అయినా మాకు 18 నెలల నుండి ఇప్పటివరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. కిస్తీలు సకాలంలో చెల్లించినందువలన ఫైనాన్స్ కంపెనీల వేధింపులు తట్టుకోలేక డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో అనేకంగా కలిగి ఉన్నాయి. కాబట్టి, మాకు బిల్లులు సకాలంలో చెల్లించి మా బ్రతుకులు రోడ్డు పాలు కాకుండా చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము.కావున ఆయుర్వేకిల్ బిల్స్ కూడా అదే విధంగా చెల్లించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ని మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఓనర్ మరియు డ్రైవర్లు పాల్గొనడం జరిగింది.