తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: గోల్కొండ శ్రీ జగధాంబిక మహంకాళి అమ్మవారి ప్రథమ బోనం సమర్పణ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. బోనాల జాతరలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగే బోనాల్లో తొలి బోనాన్ని కుమ్మర్ల సంఘం గోల్కొండ మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, వైరస్‌ల బారిన పడకుండా అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని ప్రార్థించారు.