• ఓటు మ్యాపింగ్, ఫారాలు నింపడంలో ప్రజలకు ఉచిత సహాయం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా మణికొండ, నెక్నంపూర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సహాయం అందిస్తున్నారు. మాజీ కౌన్సిలర్లు ఆలస్యం నవీన్, పద్మారావు ఆధ్వర్యంలో బట్టర్‌ఫ్లై సర్కిల్ సమీపంలోని ఓల్డ్ ఏ–1 హోటల్ వద్ద గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సహాయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బీఎల్ఓల వద్ద నుంచి ఫారాలు తీసుకురావడం, వాటిని పూరించడం, 2002 ఓటరు జాబితాలోని తమ లేదా కుటుంబ సభ్యుల ఓటుతో ప్రస్తుత ఓటును మ్యాపింగ్ చేయడంలో పూర్తి సహకారం అందిస్తు న్నామని బీఆర్ఎస్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, దేవి ప్రియ తెలిపారు. ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
