తెలంగాణ ఎక్స్ ప్రెస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం, రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ మాక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ రోడ్ నెంబర్ 9బీ లో చెత్త పెద్దఎత్తున పేరుకుపోయి రోడ్డుమీదకు వచ్చి సమస్యగా మారిన విషయాన్ని మున్సిపల్ వారికి విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి త్వరితగతిన చెత్తను తొలగించారు. అదేవిధంగా, మాక్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రోడ్ నెంబర్ 9లో పొంగుతున్న డ్రైనేజీ స్లోప్ డైవర్షన్ గురించి గతంలో మేనేజర్ కు రిప్రజెంటేషన్ అందించిన అనంతరం వారు ఆ పనిని మొదలుపెట్టగా ఆ లైన్ లో బండ రావడంతో పని ఆగిపోయిన విషయం జనరల్ మేనేజర్ కు ఈరోజు వివరించి వెంటనే పనిని మొదలుపెట్టాలని రిప్రజెంటేషన్ అందజేయటం జరిగింది.