తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ : మహబూబాబాద్ జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ) తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా నూతన ఆడ్హాక్ కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా జిల్లాలలోని మండల గ్రామీణ విలేకరుల సమక్షంలో సభ్యులందరి అంగీకారంతో సీనియర్ పాత్రికేయులు అనుభవజ్ఞులై న హనుమాండ్ల రామకృష్ణ రెడ్డిని జిల్లా ఆడ్హక్ కమిటీ కన్వీనర్ గా ప్రకటించారు గురువారం రాత్రి మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ వివేకానంద బీఈడీ కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనిల్ దేశాయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రాణా ప్రతాప్ రజ్జు భయ్యా మాట్లాడుతూ జర్నలిజం అనేది కేవలం వార్తలను చేరవేసే వృత్తి మాత్రమే కాదని ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన సేవ అని అన్నారు ప్రస్తుతం కృత్రిమ మేధస్సు సోషల్ మీడియా విస్తరణతో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరిస్తూనే తమ వ్యక్తిగత అధ్యయనం విశ్లేషణా సామర్థ్యం వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్ చెకింగ్) నైతిక విలువలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.”ఏఐ ఒక సాధనం మాత్రమే జర్నలిస్టు స్థానాన్ని భర్తీ చేయలేదు నిజాన్ని వెలికితీయడం సమాజ ప్రయోజనాలను కాపాడడం ప్రజల గొంతుకగా నిలవడం అనేవి జర్నలిస్టు యొక్క ప్రత్యేక బాధ్యతలు అందుకే ప్రతి జర్నలిస్టు నిరంతర అధ్యయనం సాంకేతిక పరిజ్ఞానం సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలి” అని ఆయన అన్నారు.గ్రామీణ ప్రాంత విలేకరుల సంక్షేమం జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ ఇండ్ల స్థలాలు హెల్త్ కార్డులు అక్రిడిటేషన్ సంక్షేమ పథకాల అమలు కోసం వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా నిరంతరం ప్రభుత్వంతోయాజమాన్యాలతో సమన్వయం చేస్తూ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు ప్రింట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా జర్నలిస్టులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరిగే దాడులను చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు అనంతరం మహబూబాబాద్ జిల్లా నూతన ఆడ్హాక్ కమిటీని ఏకగ్రీవంగా ప్రకటించారు
నూతన కమిటీ వివరాలు: కన్వీనర్ హనుమాండ్ల రామకృష్ణారెడ్డి సంఘటన కార్యదర్శి అంబాల కుమారస్వామి సంయుక్త కన్వీనర్లు పల్లె శ్రీనివాస్ బండ రాజ్ కుమార్ రాచగొల్ల సత్యనారాయణ తోకల రామచంద్రు కో-కన్వీనర్లు కొండి సాయి కిరణ్ మురుదొడ్డి కార్తీక్ దొంత పురుషోత్తం హెచ్. ప్రవీణ్ శివరామకృష్ణ తక్కెళ్లపల్లి శ్రీనివాస్ కమిటీ సభ్యులు శ్రీరామ్ ప్రసాద్ వెంకట్రాం నరసయ్య రాపోలు శ్రీనివాస్ కొప్పు సత్యనారాయణ తప్పెట్ల రాజు మిట్టగడుపుల మహేందర్ వాణి సతీష్ యాకయ్య మధు అంగోత్ లక్ష్మణ్ గొర్రె భరత్ తదితరులు పాల్గొన్నారు.
