తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు. హెల్త్ కార్డులు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డులు అందేలా చర్యలు జరుగుతున్నాయని, పీఆర్సీ ప్రకటించేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ అంశాలపై ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూక్య శ్రీను నాయక్ అధ్యక్షత వహించగా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామల మహేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొనగారి కృష్ణారెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కన్నయ్య గోవర్ధన్ యాదవ్, రాజేంద్రనగర్ మండల అధ్యక్షుడు సుదర్శన్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస సాగర్, గౌరవాధ్యక్షుడు మాణిక్యం రెడ్డి, శేరిలింగంపల్లి అధ్యక్షుడు హనుమంతు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, సుధాకర్, వహీద్, కిరణ్ కుమార్ రెడ్డి, రోహిణి, అల్లవెల్లి, సత్యన్న, చిందం వెంకట్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సురేష్, చంద్రశేఖర్, శ్రీధర్, ప్రకాష్ లింగం తదితరులు పాల్గొన్నారు.
