తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెల్దండ, ఆమనగల్, తలకొండపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ పత్రాలను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని, వైద్య ఖర్చులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
